Friday, April 18, 2025

ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. రమేష్ బాబు

 

ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. రమేష్ బాబు


ప్యాపిలి, ఏప్రిల్ 17, (కర్నూలు ప్రభ న్యూస్) :
 

 

ప్యాపిలి మండలంలోని యన్. రాచర్ల నూతన ఎస్‌ఐగా ఏ.రమేష్ బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. విధినిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ లక్ష్మణరావు అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్లినట్లు తెలిపారు.

ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. రమేష్ బాబు

  ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. రమేష్ బాబు ప్యాపిలి, ఏప్రిల్ 17, (కర్నూలు ప్రభ న్యూస్) :     ప్యాపిలి మండలంలోని యన్. రాచర్ల నూతన ఎస్‌ఐగా ఏ...